మన శరీరంలోని వేడిని EP షీట్ పరుపులు అస్సలు గ్రహించవు. అందువల్ల పరుపు వేడిగా అనిపిస్తుంది. ఫోమ్ పరుపు 5 నుండి 10 నిమిషాలు పాటు మాత్రమే గ్రహించగలవు. ఆ తర్వాత పరుపు వేడెక్కడం మొదలు పెడుతుంది. దీనికి తరుణోపాయం ఏంటంటే శరీరతత్వాన్ని మంచిగా కాపాడుకోవడం మాత్రమే. లాటెక్స్ కాని, కొబ్బరి పీచు కాని, స్వచ్ఛమైన దూది కాని, శరీరంలోని వేడిని కొంచెం ఎక్కువగా గ్రహిస్తాయి.
అయితే ఈ మూడిట్లో కూడా కొబ్బరి పీచు మీద పడుకుంటే గట్టిగా ఉంటుంది. ఇంకా సౌకర్యవంతంగా ఉండదు. ప్రస్తుతం కొబ్బరి పీచు సరైనది కూడా రావట్లేదు. తొందరగా పాడైపోతుంది. కొబ్బరి పీచు పరుపులు కొనుగోలు చేస్తే సంవత్సరం రెండు సంవత్సరాలు కల్లా గుంతలు గుంతలుగా వచ్చేసి పాడైపోతుంది. దూది పరుపు కూడా వాడుకలో గుంతలు పడిపోయి ఉండలు ఉండలుగా మారిపోయి కొంత కాలానికి ఉపయోగం లేకుండా అయిపోతున్నాయి. సహజ పదార్థమైన లాటెక్స్ అది కూడా ఒరిజినల్ రబ్బర్ మాత్రమే అయి ఉండాలి.

వీటిల్లోనే ప్రస్తుతం ఆర్టిఫిషియల్, సింథటిక్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒరిజినల్ లాటెక్స్ తీసుకుంటే కనిష్టంగా అరగంట సేపు అయినా మన శరీర వేడిని గ్రహిస్తాయి. ఆ తర్వాత ఇది కూడా వేడిగానే అనిపిస్తుంది. ఈ లాటెక్స్ లో రంధ్రాలు ఉండడం వల్ల వాటి ద్వారా గాలి ప్రసరణ బాగా జరిగి, ఇంకో అరగంట చల్లదనంగా అనిపిస్తూ ఉంటుంది అంతే తప్ప, లాటెక్స్ పరుపు మీద పడుకున్నా కూడా విపరీతమైన చల్లదనంగా ఏమీ అనిపించదు. శరీరంలోని వేడిని గ్రహించేదాకా మాత్రమే చల్లగా అనిపిస్తుంది. దానికన్నా మించి ఉంటే ఇది కూడా వేడిగానే అనిపిస్తుంది. వేడి రాకుండా ఉండాలంటే శరీరాన్ని చల్లదనంగా ఉంచుకోవాలి.
ఆర్టిఫిషియల్ ఫోమ్ లు, EP షీట్ ఫోమ్ లు, ప్లాస్టిక్ వి వాడడం వల్ల అసలు వేడిని గ్రహించవు. వాటిల్ని వదిలేసి నాచురల్ ప్రోడక్ట్ ఎంచుకుంటే కొంతసేపైనా శరీరాన్ని శరీరానికి చల్లదనాన్ని అందిస్తూ సౌకర్యవంతంగా ఉంటుంది. కూల్ జెల్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఇది లిక్విడ్ లా ఉంటుంది. దీన్ని ఫోమ్ ల తయారీలో కలుపుతారు. దాని వల్ల అదనంగా ఇంకో పది నిమిషాలు మాత్రమే చల్లదనంగా అనిపిస్తుంది తప్ప ఎల్లప్పుడూ చల్లగా ఉండదు. అలా కాకుండా కూలింగ్ జెల్ షీట్ లు అమ్ముతున్నారు.

పరుపు మీద ఆ షీటు వేసుకున్నా కూడా అది ప్లాస్టిక్ అవడం వల్ల వేడిగా మాత్రమే అనిపిస్తుంది. గది ఉష్ణోగ్రతను బట్టి ఈ కూల్ జెల్ చల్లదనం పనిచేస్తుంది. వాస్తవంగా కూల్ ప్యాకులను ఫ్రిడ్జ్ లో ఉంచి, శరీర భాగాల్లో నొప్పిగా అనిపించిన చోట, ఇంకా ఆహారం తీసుకున్నాక పొట్ట మీద ఉంచుకొని ఉపసమనాన్ని పొందొచ్చు. కానీ పరుపులకి అంతగా పని చేయవు. AC గదుల్లో వాడుకునేటప్పుడు గది ఉష్ణోగ్రతను బట్టి అంతే చల్లగా ఉంచుతుంది తప్ప దీని వల్ల అంతగా ప్రయోజనం ఉండదు.AC వేసుకోకపోతే ఇది కూడా చల్లదనాన్ని ఇవ్వదు.
ఇదేమి కూలింగ్ ఇచ్చే మెటీరియల్ కాదు. ఇది కూడా కృత్రిమమైనదే. శరీరంలో రక్తస్రావాలు జరుగుతున్నా , చిన్న చిన్న దెబ్బలకి ఇది ఉపశమనం కలిగిస్తుంది. కాని పరుపుకి ఏమాత్రం చల్లదనాన్ని కలిగించదు. ఇటువంటి పరుపులు విషయంలో ఎటువంటి సందేహాలు ఉన్నా v furniture mall యాజమాన్యం వారు నిర్వహించే ప్రత్యక్ష కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు v furniture mall వారు నిర్వహించే ప్రత్యక్ష ప్రసారంలో వినియోగదారులు తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఇంకా v furniture mall app ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదనపు సమాచారం కొరకు మా varamlatex.in websites ను చూడవచ్చు.



