చిరు వ్యాపారస్తులు Shopping Mall పెట్టడం ఎలా?

video

మీ అందరికి షాపింగ్ మాల్ పెట్టాలనుంటుంది. కాని ,దాని కోసం ఎన్నో రకాల ఆలోచనలు వస్తుంటాయి . ఎలా పెట్టాలి ? ఎం చేయాలి ? ఎలా ప్రారంభించాలి ? అని..అలా ఆలోచిస్తూ ఇబ్బందిపడుతుంటారు . అది ఎలా చేయాలి అనే దాని కోసం ఒక చిన్న లాజిక్ చెబుతాను చూడండి .


మీరు ఇన్నాళ్ల నుండి వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీరు ఉన్న చుట్టుపక్కలలో ఇంకా ఎన్నో వివిధ రకాలైన షాపులు ఉండే ఉంటాయి . ఉదహరనికి ఒక ఐదు షాపులు యొక్క ఓనర్లు కలిసి ఒక పెద్ద షాప్ లాగా చేయచ్చు. ఇలా ఐదుగురు కలిసి చేయడం వలన కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు,భయాలు ఉంటాయి. అంటే ముఖ్యముగా డబ్బు విషయంలో కాని మీకు అటువంటి భయం అవసరమే లేదు . ఎందుకంటే ఇప్పుడు మొత్తం టెక్నాలజీ అంత చాలా అభివృద్ధి చెందింది కాబట్టి మనకి జి.ఎస్.టి అనేది వచ్చింది. ఈ జి.ఎస్.టి వలన మనకి అన్ని ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ మాత్రమే దీనివలన అన్ని ఆన్లైన్ లోనే మనం బిల్లింగ్ చేయడం అనేది అవుతుంది కాబట్టి అన్ని బిల్స్ జాగ్రత్తగా ఉంటాయి.


దీనికొసం మీరు చేయాల్సింది ఏంటంటే మొత్తం మానేజ్మెంట్ చేసుకోడం,వర్క్ లోడ్ చూసుకోవడం దానిని ఐదుగురు పంచుకోవటం మాత్రమే. మీ షాపుని మాల్ గా మార్చుకోవటం ఎలా అంటే చిన్న చిన్న మార్పులు చేసుకొని ఇప్పుడు ఉన్న షాపు నుండి ఒక ఐదు అడుగులు వెనక్కి వెళ్లి అక్కడ ఒక పెద్ద గోడలాగా కట్టేసి ఒక ఐదు భాగాలూగా చేసి ఐదు కౌంటర్లు పెట్టేసి బిల్లింగ్ సెక్షన్ అని పెట్టండి ,దీన్ని మొత్తానికి కలిపి ఒక బోర్డ్ పెట్టండి . ఇప్పుడు ఒకొక కౌంటర్లో వివిధ రకాలైన ఐటమ్స్ అమ్మవచ్చు.

ఇప్పుడు కౌంటర్ 1 లో కిరానా షాపు లో దొరికే వస్తువులు అంటే కందిపప్పు,మినపప్పు .

అలా..కౌంటర్ 2 లో కిచెన్వేర్ వస్తులు స్టీల్ వస్తులు,ప్లాస్టిక్ వస్తువులు.

అలా .. ఇంకా కౌంటర్ 3 లో కూరగాయలు,పాల ప్యాకెట్లు ,కూల్ డ్రింకులు ,ఇంకా అలా ఫాన్సీ ఐటమ్స్ ఒక కౌంటర్ లో పెట్టి వ్యాపారం సులభంగా చేయచ్చు .

ఇంతకుముందు ఏంటంటే అన్ని షాప్ లో ఒక 100 రకాల ఐటమ్స్ మాత్రమే అమ్మేవాళ్లు . ఇప్పుడు ఐదుగురు కలిసి అంటే 500 ఐటమ్స్ ఒకే షాపులో అమ్ముతున్నారు కాబట్టి మీకు ముందుకంటే ఒక మూడురేట్లు ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉంది . అలాగే దీనివళ్ళ ఇంకా కొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్కుంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో ఒక 15% డిస్కౌంట్ అలా పెడుతుంటారు కానీ ఇప్పుడు అంత అవసరం లేదు ఎందుకంటే ఇప్పుడు స్మార్ట్ బిజినెస్ అని ఒకటి మొదలైంది దానివల్ల బిల్లింగ్ లో మన పేరు పెట్టగానే ఒక 10% అదనపు డిస్కౌంట్ ఉంటుంది. ఈ విషయము తెలియకపోవడం వలన మీరు కొన్ని ఉపయోగాలు కోల్పోతున్నారు . ఇప్పుడు అదే మాల్ మీరు పెట్టారు అనుకోండి ఆ బెనిఫిట్స్ అన్ని మీకు అందుతాయి .


మనం ఒక 20సంవత్సరాల నుండి శ్రమిస్తూ అష్టావధానం చేస్తున్నాం.ఏంటంటే మనమే కస్టమర్స్ కి ఏం సరుకులు కావాలో ఇస్తున్నాము,పొట్లాలు కడుతున్నాం,బిల్ రాసుకుంటున్నాం,ఏమైనా ఐటమ్స్ ఉన్నాయో లేదో అని చూసుకుంటున్నాం , మన షాపులో ఏమైనా ఐటమ్స్ లేకపోతే బయట నుండి కొంటున్నాము ఇలా అన్ని పనులు మనమే చేసుకుంటు వచ్చాము. ఇక నుండి అలా కాకుండా ఐదుగురు కలిసి ఒక టీం లాగా కలిసి వర్క్ చేస్తాం కాబట్టి ఎవరికీ శ్రమనిపించదు పైగా టైమ్ అనేది వృధా కాకుండా ఉంటుంది.


ఇవన్నీ మనకి ఎలా చేయాలి అనే అవగాహనా లేకపోవడం వలన బయటవాళ్ళు వచ్చి మాల్స్ పెట్టడం వలన మన వ్యాపారాలు దెబ్బతింటున్నాయి .పైగా ఇప్పుడు మన పిల్లలు కూడా అక్కడికి వెళ్లి పని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అలా కాకుండా మనమే మాల్ పెట్టుకోడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి .
మనమే సొంతంగా షాపింగ్ మాల్ పెట్టడం వలన ఉండే ఉపయోగాలు….
1.వర్క్ లోడ్ అనేది అందరూ చెరుసమానంగా పంచుకుంటారు .
2.ఐదుగురుకి కలిపి ఒక గోడౌన్ మాత్రమే సరిపోతుంది .
3.మన ఇంట్లో పిల్లలు కూడా మాల్లో వచ్చి వర్క్ చేయడానికి ఇష్టపడతారు .
వీటన్నిటితో పాటు మన బిజినెస్ అభివ్రిద్ది చెందితే మనకి సమాజములో గౌరవం అనేది పెరుగుతుంది పైగా మనతో పాటు మన పిల్లలకి కూడా ఒక పేరు అనేది నిలబడిపోతుంది.


ఇప్పుడు బయట పెద్ద పెద్ద మాల్స్ ని చూసి మీరు బయపడనక్కర్లేదు ఎందుకంటే వాళ్ళకంటే ఎక్కువ తెలివి మనకే ఉంది , శ్రమించే శక్తి మనకే ఉంటుంది. ఆ మాల్స్ వాళ్ళు బ్రాండ్స్ ని మాత్రమే నమ్ముతారు కాని ప్రోడక్ట్ యొక్క నాణ్యత గురించి పట్టించుకోరు,ఆలోచించరు. మనకి నాణ్యత గురించి తెలిసినంతగా వాళ్ళకి తెలిదు. ఉదాహరణకి చూస్కుంటే మనం రుచి బాగుంటుందని నల్ల కొబ్బరి అమ్ముతాము కానీ వాళ్ళు ఎర్ర కొబ్బరి అమ్ముతారు,అలాగే మాల్స్ వాళ్ళు రంగు వేసిన ధనియాలు అమ్ముతారు కాని వాటికంటే రంగు వేయని ధనియాలు బాగుంటాయని మనకి తెలుసు మన కస్టమర్లకి తెలుసు. అలాగే మాల్స్ వాళ్ళు రంగు వేసిన బెల్లం అమ్ముతారు మనం రంగువేయని బెల్లం అమ్ముతాము,అలా చింతపండు, మినపప్పు ఇంకా అలా చూస్కుంటే అన్ని ఐటమ్స్ మీద మనకి ఉన్నంత అవగాహన పెద్ద మాల్స్ కి ఉండదు. వాళ్ళు ఎప్పటికి ఆ బ్రాండ్స్ మీద నమ్మకం పెట్టుకుంటారు తప్ప నాణ్యత గురించి చుస్కోరు. ఇలా మనకి ఉన్న ఈ నాలెడ్జితో కనుక మనం మాల్ పెడితే బిజినెస్ అనేది చాలా బాగా అభివృద్ధి చెందుతుంది.


ఇప్పుడు మనకి అదనంగా ఒక 10% డిస్కౌంట్ అనేది వస్తుంది కదా దానితోపాటు పెద్ద బ్రాండ్స్ కి గనుక మనం ఒక ర్యాక్ ఇస్తే వాళ్ళు అందులో వాళ్ళ ఐటమ్స్ డిస్ప్లేలో పెట్టుకొని మనకి డిస్ప్లే అమౌంట్ అనేది కూడా ఇస్తారు పైగా వాళ్ళ ఐటమ్స్ని ప్రోమోట్ చేస్కోడం కోసం మన స్టాఫ్ కి శాలరీ కూడా ఇస్తుంటారు .
మనం ముందు ఒక కిరానా షాపులో ఒంటరిగా ఎనిమిది నుండి పది గంటలకు మించి ఎక్కువ పనిచేయలేము దానివల్ల రెంటు అనేది ఎక్కువ పడుతుంది. అదే మాల్స్ లో చూస్కుంటే మనము వర్క్ ని షిఫ్టులు లాగా డివైడ్ చేసుకొని పని చేయడం వలన ఎవరికీ అలుపు అనేది తెలిదు, పైగా రెంట్ అనేది సగానికి సగం తగ్గుతుంది. ఇప్పుడు బ్యాంకునుండి లోన్ తెచ్చి పెట్టమనుకోండి 16 గంటలు పని చేయడం వలన మనకి బ్యాంకులోన్ ఇంటరెస్ట్ అనేది కూడా తగ్గుతుంది . పైగా ఇలా షిఫ్ట్ సమయంలో పని చేయడానికి కూడా స్టాఫ్ కి సులువుగా ఉంటుంది. అలాగే కొంతమందిని బిల్లింగ్ దగ్గర , సేల్స్ దగ్గర కొంత స్టాఫ్ ని పెట్టి వాళ్ళకి మినిమం శాలరీ అనేది ఇస్తూ మనం మాల్ ని 16 గంటలు సులువుగా నడపచ్చు .


ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద బ్రాండ్స్ చూస్కుంటే వాళ్ళు రెండు కొంటె ఒకటి(2+1) ఫ్రీ అనేది పెడ్తారు అది కేవలం పెద్ద మాల్స్ కి మాత్రమే ఇస్తుంటారు ఎందుకంటే వాళ్ళు అన్ని ఎక్కువ అమౌంట్ లో కొనుగోలు చేస్తారు. అక్కడ ఎం జరుగుతుంది అంటే 100గ్రాములు ఉన్న బిస్కెట్ పాకిట్ మీద 70 గ్రాములు మాత్రమే ఉంటుంది ఏంటంటే మూడు ప్యాకెట్లు మీద 10 గ్రాములు అదనంగ ఇస్తున్నారు ఇవన్నీ ఏంటంటే పెద్ద కంపెనీ లు యొక్క బిజినెస్ ఐడియాస్. ఇందువల్ల షాపింగ్ మాల్స్ కి అనేక రకమైన బెనిఫిట్స్ ఈ పెద్ద కంపెనీలు కలిపిస్తున్నాయి.
మాల్ గురించి ఎటువంటి భయం లేకుండా చక్కగా సీసీ కెమెరాలు పెట్టి ఎప్పటికి అప్పుడు అంత గమనిస్తూ ఉండచ్చు . ఇంకా మన బిజినెస్ అభివృద్ధి చేయాలనుకుంటే ఆన్లైన్ షాపింగ్ అనేది ఒకటి పెట్టి ఐదుగురు కలిసి ఆలోచించుకొని ఒక వెబ్సైట్ లాగా తయారుచేసి హోమ్ డెలివరీ ద్వారా కస్టమర్స్ కి ఐటమ్స్ అందించ వచ్చు. ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకున్న పని అని మీరు భయపడకండి ఎందుకంటే ఇప్పుడు మనం మన ఇంటి కోసం ఎంతైనా పెట్టడానికి తయారుగా ఉంటాం కానీ వ్యాపారం మీద పెట్టడానికి ఆలోచిస్తూ ఉంటాము. అలా కాకుండా మీరు మీ భయాన్ని పక్కన పెట్టి వ్యాపారాన్ని నమ్మి పెట్టుబడి అనేది పెడితే మనము పైకి వస్తాము అలాగే మన పిల్లలు కూడా మనతో ఉండి మన బిజినెస్ చూసుకుంటారు . ఇప్పుడు ఏమవుతుంది అంటే పిల్లలు అందరూ మన దేశాన్ని వదిలేసి పక్క దేశాలు వెళ్ళి చదుకోటం అక్కడే ఉండిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు.మనం గనుక మాల్ పెడితే మన పిల్లలు మనతోనే ఉండి మంచి పేరుతెస్తారు.


షాపింగ్ మాల్ ని మనకి ఉన్నంత దాంట్లో తక్కువ ఖర్చులో కూడా మొదలుపెట్టచ్చు .ఎలా అంటే ముందు రెడీమేడ్ ర్యాక్స్ కొనండి,తర్వాత మాల్ మొత్తం ఒకే రంగు పెయింట్ వేయించండి,ఒకే ఫ్లెక్స్ బోర్డు పెట్టండి ఇలా అన్ని తక్కువ లో చేసుకుంటే మనకే ఉపయోగం. మనము కిరానా షాప్ నడిపేటప్పుడు 20000 స్టాక్ ని కొని నెల కి 2000 చొప్పున జమ చేస్తుంటాము దానివళ్ళ ఎప్పుడైనా జమ రాయటం మరిచిపోతే మనకే నష్టం.అలా కాకుండా మొత్తం సరుకు ఒకేసారి డబ్బులు కట్టేసి తీస్కోడం వాళ్ళ మనకి మొత్తం మీద ఒక 5% డిస్కౌంట్ అనేది లభిస్తుంది అలాగే మనం కూడా మన కస్టమర్లకు కూడా ఇలా డిస్కౌంట్ సదుపాయాలు కల్పించచ్చు.
ఈ మాల్ ఐడియాను ఆచరణలో పెట్టడం ఎలా?

  1. ముందు మీరు దీనిగురించి పూర్తియిగా తెలుసుకొని మీ పక్కన తెలిసిన షాపులో వాళ్ళు అందరూ ఒక టీంగా తయారయ్యి వాళ్ళందరికీ అర్థమయ్యేలా మొత్తం వివరంగా తెలియజేయండి.
  2. ఒకవేళ ఆ పెద్దవాళ్ళు అర్థంకాక వినకపోతే వాళ్ళ పిల్లల్తో మాట్లాడి ఈ ఐడియాను అమలు చేయండి.
  3. మీ అందరూ కలిసి ఒక ఆడిటర్ ని పెట్టుకొని మీ ఐడియా గురించి అతనకి చెప్తే మిగతాదంతా ఆ ఆడిటర్ చూసుకుంటారు.
  4. ఆడిటర్ ఉండటం వలన మనకి ఎన్నో విధాలుగా ఉపయోగాలుంటాయి అంటే మనకి వ్యాపారంలో ఏమైనా సమస్యలు వస్తే వాళ్ళు సహాయం చేస్తారు. అలాగే జి.ఎస్.టి రిటర్న్స్,ఆదాయపు లోన్,బ్యాంకు లోన్స్ ఎలా తీసుకోవాలి అనే విషయం లో మీకు సహాయం చేస్తారు. కాకపోతే మీరు ఆ ఆడిటర్ గారికి ఒక 5% షేర్ అనేది ఆయనకి బెన్ఫిట్గా ఇస్తే మన వ్యాపారాలలో ఏమైనా సమస్యలు ఉంటె మొత్తం వాళ్ళే చూసుకుంటారు.

More Info Check The Video Below

ధన్యవాదాలు

మా వెబ్‌సైట్‌కు సందర్శించినందుకు ధన్యవాదాలు
Stay Connected
close-link
Varam Latex - 9392912609 From The House Of V Furniture Mall
FLAT 10% OFF
To Learn More 
SUBMIT
close-link
If you dont have any coupon then use this .